Mla Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న నేడు మరణించారు. ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సాయన్నను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా.. (Mla Sayanna)
తెలంగాణ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అకాల మరణం చెందారు. ప్రస్తుతం ఆయన వయసు.. 72 సంవత్సరాలు కాగా.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతూ నేడు మృతిచెందారు. ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ.. సాయన్న తుది శ్వాస విడిచారు. జి. సాయన్న.. 1951 మార్చి 5వ తేదీన చిక్కడపల్లిలో జన్మించారు. ఇక ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్నకు భార్య, ముగ్గుకు కుమారులు, కూతురు ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం ఇదే..
సాయన్న రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగు దేశం పార్టీతో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న తెదేపా తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి చెందారు. 2014 తర్వాత సాయన్న భారాసలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు.
సాయన్న జీవితం.. తెలుగుదేశం పార్టీతో ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
సాయన్న మృతి పట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ అన్నారు.