Site icon Prime9

Sankranthi : సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ ఎవరంటే.. చిరంజీవా ? బాలకృష్ణనా ??

movies and web series list of ott release in today

movies and web series list of ott release in today

Sankranthi : ఈసారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీలో నిలవాదం అందరి దృష్టిని ఆకర్షించింది.

నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి”.. మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమాలు సంక్రాంతికి పోటీపడడం చాలా గ్యాప్ తర్వాత జరిగింది.

సీనియర్ హీరోలుగా.. మాస్ ఆడియన్స్ లో వాళ్ళకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

గతంలో పలుమార్లు పోటీకి వచ్చిన ఈ హీరోలు దాదాపు ఇద్దరు హిట్లు అందుకొని ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.

ఇక ఇప్పుడు కూడా ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తో విజయం సాధించడం అభిమానులకు పండగే అని చెప్పాలి.

దీంతో సంక్రాంతిని మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

అలానే డబ్బింగ్ చిత్రాలైన విజయ్ “వారసుడు”.. అజిత్ “తెగింపు” చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.

తమిళనాట వీరిద్దరికీ ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ నాలుగు సినిమాలలో ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు బయటికొచ్చాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్లలో టాప్ ఎవరో మీకోసం ప్రత్యేకంగా ..

బాలయ్య “వీర సింహారెడ్డి”.. Sankranthi

2021లో బోయపాటి దర్శకత్వంలోనే వచ్చిన బాలకృష్ణ ‘అఖండ’ రూ.100 కోట్ల మార్కును అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా రూ.133 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది.

బాలయ్య ‘అఖండ’తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దీంతో ‘వీరసింహారెడ్డి’ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

దాంతో పాటు బాలయ్యాను ఫుల్ మాస్ అవతార్ లో చూపించడంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడు.

ఇక దీంతో గతంలో తన సినిమాలు కంప్లీట్ రన్‌లో వసూలు చేసిన మొత్తాన్ని ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాలయ్య తొలిరోజే వసూలు చేయడం విశేషం.

ఈ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవినే కాకుండా.. తమిళంలో స్టార్ హీరోలు అయిన విజయ్, అజిత్ కుమార్‌ సినిమాల తొలిరోజు కలెక్షన్‌ను బాలయ్య దాటేశారు.

‘వీరసింహారెడ్డి’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.54 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఈ నంబర్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి.

చిరు వాల్తేరు వీరయ్య.. Sankranthi

ఇక చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సైతం రూ.50 కోట్ల మార్కును దాటలేకపోయింది.

ఈ సినిమా రూ.49.5 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.

చిరు గత చిత్రాలైన ఆచార్య ప్రేక్షకులను నిరాశ పరచగా.. గాడ్ ఫాదర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఈ ఎఫెక్ట్ వాల్తేరు వీరయ్యపై పడిందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

ఇక వీరయ్య చిత్రం ఫుల్ మాస్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

డబ్బింగ్ చిత్రాలు..

ఇక జనవరి 11 వ తేదీ రిలీజ్ అయిన ‘వారిసు’, ‘తునివు’ తొలిరోజు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేయలేకపోయాయి.

విజయ్ “వారిసు” తొలిరోజు రూ.47 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. అజిత్  “తునివు” రూ.41 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది.

మొత్తం మీద సంక్రాంతి రేసులో తొలిరోజు బాలయ్యదే పైచేయిగా తెలుస్తుంది.

అయితే రెండో రోజు మాత్రం ‘వీరసింహారెడ్డి’ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.

తొలిరోజు వసూలు చేసిన మొత్తంలో 30 శాతం మేర మాత్రమే రెండో రోజు వసూలైందని ట్రేడ్ వర్గాల సమాచారం.

చూడాలి మరి ఫుల్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అని..

Exit mobile version