Samanth Reacted on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బన్నీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇక ఆ టైంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు హుందాగా ఉందంటూ ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి రావడంతో సినీ ప్రముఖులంతా స్వయంగా వెళ్లిన పలకరిస్తున్నారు.
నిన్న జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంకు డైరెక్టర్స్ కొరటాల శివ, సుకుమార్, వంశీ పైడిపల్లి హీరోలు నాగచైతన్య, రానా, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, శర్వానంద్, శ్రీకాంత్‌తో పాలు తదితరులు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఇక ప్రభాస్, ఎన్టీఆర్ ఫోన్‌లో అల్లు అర్జున్‌తో మాట్లాడారు. ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారంత అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ సమంత బన్నీ అరెస్ట్‌పై స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేస్తూ ఎమోషనలైంది.
కాగా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి రాగానే ఆయన భార్య స్నేహారెడ్డి హత్తుకుని ఎమోషలైన దృశ్యం అక్కడ ఉన్న ప్రతిఒక్కరిని కూడా భావోద్వేగానికి గురి చేసింది. అలాగే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్నేహరెడ్డి బన్నీ పట్టుకుని ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. అలాగే సమంత కళ్లు కూడా చెమ్మగిల్లాయట. ఈ వీడియో తన ఇన్‌స్టా స్టోరీ షేర్ చేస్తూ.. “ఇప్పుడు నేనేం ఏడవడం లేదు ఓకే” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇలా పరోక్షంగా తాను కూడా భావోద్వేగానికి లోనయ్యానని చెప్పకనే చెప్పింది సామ్.