Site icon Prime9

Samantha: అందుకే నా పెళ్లి గౌను రీ మోడలింగ్‌ చేయించా: సమంత

Samantha About her Wedding Gown: విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్‌ సమంతపై ట్రోల్స్, వ్యతిరేక కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. డైవోర్స్‌కి ఆమె కారణమంటూ కొందరు సమంత విమర్శించారు. అంతేకాదు తనన విమర్శిస్తూ, నాగచైతన్యకు సపోర్టు ఇచ్చారు. విడాకుల అనంతరం సోషల్‌ మీడియాలో ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. అయితే వాటిపై ఎప్పుడు ఆమె స్పందించలేదు. కానీ సందర్భంగా వచ్చినప్పుడల్లా తన విడాకులపై పరోక్షంగా కామెంట్స్‌ చేస్తూ వచ్చింది.

మూవీ ఈవెంట్స్‌లోనూ తన మయోసైటిస్‌, విడాకులపూ భావోద్వేగానికి లోనయ్యేది. అయితే తాజాగా సామ్‌ డైవోర్స్‌ తర్వాత తనపై వచ్చిన వ్యతిరేకతపై తాజాగా స్పందించింది. ప్రస్తుతం తన లేటెస్ట్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సక్సెస్‌ని జోష్‌తో ఉన్న ఆమె తరచూ ప్రమోషనల్‌ కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొనే సామాజీక సవాళ్లపై సామ్‌ మాట్లాడుతూ.. “ఒక బంధం విడిపోతే అందరూ అమ్మాయినే తప్పుబడతారు. వారి గురించి నెగిటివ్‌ మాట్లాడతారు. లేనిపోని నిందలు వేసి అసత్య ప్రచారం చేస్తారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. “విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయిలకు, మహిళలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్‌ ఇస్తుంది. ‘ఇక ఆమె జీవితం అయిపోయినట్టే, సెకండ్‌ హ్యాండ్‌, యూజ్డ్‌’ అనే ట్యాగ్స్‌ తగిలిస్తారు. ఇలాంటి కామెంట్స్ ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఎంతగానో క్రుంగదీస్తాయి. కష్టాల్లో ఉన్న అమ్మాయిని ఇలాంటి మాటలు మరింత బాధిస్తాయి. నా గురించి ఎన్నో అవాస్తవ ప్రచారాలు చేశారు. అవన్ని అబద్ధాలు కాబట్టే నేను వాటిపై మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదు. ఆ క్లిష్ట సమయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు సపోర్టుగా నిలిచారు. వారందరికి నేనేప్పుడు కృతజ్ఞురాలిని” అంటూ చెప్పుకొచ్చింది.

అదే విధంగా తన పెళ్లి గౌను రీమోడలింగ్‌పై స్పందిచారు. ఆ సమయంలో తనపై విమర్శలు వచ్చాయంది. కావాలనే తను అలా చేసిందని, తన మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడానికే మ్యారేజ్‌ ఫ్రాక్‌ని రీ డిజైన్ చేయించిందని విమర్శలు వచ్చాయి. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. “నా పెళ్లి డ్రెస్‌ను రీ మోడలింగ్‌ చేయించటప్పుడు చాలా బాధపడ్డాను. కానీ అది నేను ప్రతీకారం కోసం చేయలేదు. నా జీవితం అక్కడితో ఆగిపోలేదని చెప్పడానికే అలా చేశాను. నేను మరింత బలంతో ముందుకు వెళుతున్నానని చెప్పడానికి అదీ ప్రతీక. నేను ఎన్నో కష్టమైన దశలు దాటుకుని వచ్చాను. నా జీవితంలో జరిగే సంఘటనలను నేను దాచాలి అనుకోలేదు. ఎక్కడైతే జీవితం ముగుస్తుందని అనిపిస్తుందో అక్కడే మళ్లీ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను” అంటూ సామ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version