Site icon Prime9

Samantha: సమంత ఇంట తీవ్ర విషాదం – ఆమె తండ్రి కన్నుమూత

Samantha

Samantha

Samantha Father Died: స్టార్‌ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వేదికగా సమంత వెల్లడించింది. ‘మళ్లీ మనం కలిసుకునేంత వరకు డాడీ.. మిస్‌ యూ’ అంటూ హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీతో సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. అయితే ఆయన మరణానికి గల కారణం మాత్రం చెప్పలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన చనిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ విషయంలో సినీ ప్రముఖులు, ఆమె సహానటీనటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ కష్ట సమయాల్లో సమంత మరింత ధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామంటూ సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version