Site icon Prime9

Saif Ali Khan : ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..

saif ali khan going to act as a villain in ntr and koratala movie

saif ali khan going to act as a villain in ntr and koratala movie

Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్దాల పాటు సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించిన ఈ హీరో.. ఇప్పుడు ప్రతినాయకుడి గానూ మెప్పించేందుకు రెడీ అయ్యాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో సైఫ్ పాత్ర భయపెట్టే విధంగా కనిపిస్తున్నారు.

ఎన్టీఆర్ 30 లో విలన్ గా సైఫ్ (Saif Ali Khan)..

ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న చిత్రంలో సైఫ్ నటించనున్నారట. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సైఫ్ ను ఎంపిక చేయగా.. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేరుగా తెలుగు సినిమాలో విలన్ గా సైఫ్ రాబోతున్న తరుణంలో ఆయన ఏ రేంజ్ లో అలరిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆస్కార్ ని కూడా సాధించడంతో ఇపుడు తారక్ చేసే ఈ సినిమాపై కేవలం పాన్ ఇండియా వైడ్ గానే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఇక సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత విషయాలకు వస్తే..అలీ ఖాన్ మొదటి భార్య అమ్రిత సింగ్ కి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్.. అదే విధంగా రెండో భార్య కరీనా కపూర్ కి ఇద్దరు కొడుకులు తైమూర్ అలీ ఖాన్, జేహంగీర్ అలీ ఖాన్.

ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ అలరించనున్నారు. ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్ర లో కనిపించనుంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ , ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  మరోవైపు ప్రభాస్.. సలార్‌, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ k … అలానే సందీప్ రెడ్డి వంగాతో ” స్పిరిట్ ” అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటే మారుతితో కూడా ఓ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Exit mobile version