Site icon Prime9

Sai Pallavi: త్వరలో ‘అమరన్‌’ రిలీజ్‌ – భారత జవాన్లపై సాయి పల్లవి ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌, భగ్గుమంటున్న నెటిజన్స్

Sai Pallavi Old Comments viral

Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. మూవీ ఈవెంట్‌ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్‌ హీరోకి ఉండే రేంజ్‌లో ఆమెకు ఫాలోయింగ్‌ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్‌ సాయి పల్లవిని కొందరు టార్గెట్‌ చేస్తూ ఆమెపై నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తున్నారు.

తమిళ హీరో కార్తికేయన్‌ లీడ్‌ రోల్లో రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అమరన్‌’. నిజ జీవిత సంఘటన ఆధారం ఆర్మి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌. కేరళకు చెందిన మేజన్‌ ముకుంద వరదరాజన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. అయితే ఇందులో సాయి పల్లవి ఫీమేల్‌ లీడ్‌ కావడంతో గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ని వైరల్‌ చేస్తూ వివాదస్పదం చేస్తున్నారు. కాగా విరాటపర్వం మూవీ ప్రమోషన్‌లో సాయి పల్లవి హింసపై స్పందిస్తూ ఊహించని కామెంట్స్‌ చేసింది.

భారత్‌-పాకిస్తాన్‌ ఆర్మిని ఉద్దేశిస్తూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది. “పాకిస్తాన్‌లో ఉన్నవాళ్లు మన జవాన్లను టెర్రరిస్టులుగా చూస్తారు. మనం వారికి హనీ చేస్తున్నామనుకుంటున్నారు. అలాగే మనం కూడా పాకిస్తాన్‌ జవాన్లను ట్రెర్రరిస్టులుగా చూస్తాం. ఈ రెండింటి మధ్య మనం చూసే విధానం మారిపోతుంది. ఇందులో ఎవరు కరెక్ట్‌? ఎవరూ తప్పు? అని నిర్ణయించలేం. కాబట్టి హింసల వల్లే సమస్యలు పరిష్కారం కాదు కదా. ఒకప్పుడు చట్టాలు లేకపోవడం వల్ల అందరు యుద్దాలు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక హింసను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్‌ కొందరు కావాలని వివాదం చేస్తున్నారు.

తను దేని గురించి అయితే మాట్లాడిందో అది కట్‌ చేసి ఆమె పాకిస్తాన్‌-భారత్‌ ఆర్మీని ఒకటే అని చెప్పే అర్థం వచ్చే వీడియోని ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లను సాయి పల్లవిపై మండిపడుతున్నారు. మన జవాన్లను టెర్రరిస్టులతో పోల్చుతుందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడో చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు సాయి పల్లవిని అనుకోని వివాదంలోకి నెట్టేలా కనిపిస్తోందని ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోని సాయి పల్లవి అంటే ఎవరో గిట్టని వారే కావాలనే వైరల్‌ చేస్తున్నారని, వారెవరాని ఆరా తీస్తున్నారు.

Exit mobile version