Site icon Prime9

Sai Pallavi : అల్లు అర్జున్ పుష్ప 2 లో నటించడం పట్ల నోరు విప్పిన సాయి పల్లవి.. ఏమందంటే?

sai pallavi commenst on acting in allu arjun pushpa 2

sai pallavi commenst on acting in allu arjun pushpa 2

Sai Pallavi : టాలీవుడ్ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా  ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఫిదా చేసింది. ఆ పై పలు పలువురు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ  భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

అయితే సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలను సెలెక్ట్ చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. సాయి పల్లవి నటించిన రీసెంట్ చిత్రాలు ‘విరాటపర్వం’, ‘గార్గి’లో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉంది ఈ బ్యూటీ. అయితే, ఇటీవల సాయి పల్లవి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తుందని.. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి ఈ వార్తలపై స్పందించింది.

కానీ.. ఆ వార్తలు రావడం సంతోషాన్ని ఇచ్చింది – సాయి పల్లవి (Sai Pallavi)

పుష్ప-2 సినిమాలో నటించడం తాను లేదని.. తనకు ఈ సినిమా నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, తాను పుష్ప-2లో నటిస్తున్నానంటూ వార్తలు రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని సాయి పల్లవి తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె తన నెక్ట్స్ మూవీని తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా సుకుమార్ మలిచిన తీరు ప్రేక్షకులను ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవెల్‌ అని చెప్పాలి.

కాగా ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈయేడాది చివరినాటికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 

Exit mobile version