Site icon Prime9

ఏపీలో హైవే రన్‌వే: ఈ రోడ్డు మీద విమానాలు, ఫైటర్ జెట్స్ కూడా దిగుతాయి..

runway-test-in-bapatla-national-highway-by-air-force-officers

runway-test-in-bapatla-national-highway-by-air-force-officers

Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై వైమానిక విమానాలు సందడి చేస్తున్నాయి. ఎమర్జెన్సీ రన్‌వే పై ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ ను వైమానిక దళ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. దీనిలో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎయిర్ 31 ట్రాన్స్ పోర్ట్ కార్గో, సూపర్ 30 జెట్ ఫైటర్స్, తేజస్ లైట్ విమానాలు ట్రయల్ రన్ లో పాల్గొన్నాయి. రన్‌వే పై తక్కువ ఎత్తులో ఎగురుతూ పైలెట్లు రన్‌ వేని పరీక్షించారు.

రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ సమయంలో రన్వేపై వైమానిక దళాల విమానాలు దిగేందుకు ఇది అనువైన ప్రదేశమని అధికారులు నిర్ధారించారు. మిగతా పనులను త్వరలోనే పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో… రన్‌వే పై పూర్తిస్థాయిలో విమానాలను దించేందుకు చర్యలు చేపడుతున్నామని వైమానిక దళ అధికారులు తెలిపారు. కాగా ఉదయం నుంచి వైమానిక దళాల విమానాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో… అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానిక అధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే… ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తి చేశామని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

జాతీయ రహదారిని హైవేగా మార్చేందుకు హైవేల్లో కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డును ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. విదేశాల్లో ఇలాంటి నిర్మాణాలు సాధారణమే అయినా ఇటీవల కాలంలో భారత్ లో కూడా ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాదిలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టగా తాజాగా ఏపీ లోని కొరిశపాడులో ఎయిర్ పాడ్ ను తీర్చిదిద్దారు. ఈ ట్రయల్ రన్ తరువాత ఈ హైవే పూర్తి స్థాయిలో రన్ వేగా మారనుంది. ఈ హైవేపై రన్ వేని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Exit mobile version