Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 01:02 PM IST

Bhadrachalam: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49. 50 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో భద్రాచలం, చర్ల,వెంకటాపురం రూట్లలో బస్సులు నిలిపివేశారు అధికారులు.