Site icon Prime9

Rinku Singh: స్వీపర్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా.. రింకూ జీవితంలో కష్టాలు

rinku singh

rinku singh

Rinku Singh: రింకూ సింగ్.. క్రికెట్ అభిమానులు మర్చిపోలేని పేరు. గత మ్యాచ్ లో విధ్వంసం సృష్టించి కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడానికి.. చివరి బంతులను సిక్సర్లుగా బాది.. జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. కానీ క్రికెట్ లోకి రాకముందు.. రింకూ స్వీపర్ గా పని చేశాడు. అతడి విజయం వెనుక ఎంతో కష్టం ఉంది.

కుటుంబ నేపథ్యం ఇదే.. (Rinku Singh)

ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో రింకూ సింగ్ పుట్టాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ.. లైఫ్ అంతా సాఫీగా ఏ మాత్రం సాగలేదు. ఒకానొక సమయంలో.. కుటుంబ పోషణకు.. స్వీపర్ గా కూడా పని చేసినట్లు తెలుస్తోంది. రింకూ తండ్రి ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసే సంస్థలో పనిచేసేవారు. రింకూ తండ్రికి ఐదుగురు సంతానం. అందులో రింకూ మూడోవాడు. ఇరుకైన గదుల్లో నెట్టుకొస్తున్న తన తండ్రికి రింకూ సాయంగా ఉండేవాడు. దీని కోసం కోటింగ్ సెంటర్లో స్వీపర్ గా కూడా పని చేశాడు.

తండ్రి చేతిలో దెబ్బలు

రింకూకి క్రికెట్ అంటే అభిమానం. చిన్నతనంలో తండ్రి చేతిలో ఎక్కువ దెబ్బలు తినేవాడు. 2012లో ఓ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.

అందులో గెలిచిన బైక్ ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. అదే వాహనంపై సిలిండర్లు సరఫరా చేసేవాడు రింకూ తండ్రి.

మెుదట్లో క్రికెట్ అంటే ఇష్టం లేని కుటుంబ సభ్యులు.. రింకూ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ లో రింకూ అనుకున్నది సాధించాడు.

ఆ తర్వాత రంజీ ట్రోఫిలో యూపీ తరపును అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బీసీసీఐ అనుమతి లేకుండా దుబాయ్ లో ట్రోఫి ఆడేందుకు వెళ్లిన రింకూపై మూడు నెలల నిషేధం పడింది.

రింకు సింగ్‌ యూపీ తరఫున 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇక 2018లో కోల్‌కతా జట్టు రూ. 80 లక్షలకు రింకును కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఐదేళ్లుగా కేకేఆర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కోల్‌కతా సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్‌ మార్గదర్శకంలో రింకు సింగ్‌ రాటుదేలాడు.

ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లను మాత్రమే ఆడి 349 పరుగులు చేయడం గమనార్హం.

Exit mobile version