Revanth Reddy: హైదరాబాద్ లో జరుగుతున్న నిజాం అంత్యక్రియలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపడం ఏంటని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన చౌమహల్లా ప్యాలెస్ లో చివరి నిజాం పార్ధివదేహనికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిజాం రాజులు సృష్టించిన సంపద హైదరాబాద్ కే తలమానికం అని ఆయన అన్నారు. చివరి నిజాం ముఖరం ఝా ఎన్నో సామాజిక సేవలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
అధికార లాంఛనాలతో జరిపించడాన్ని తప్పుపట్టే వారు మానసిక, అంగవైకల్యం కలవారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్ధిస్తుందని తెలిపారు.
నిజాం సృష్టించిన విలువైన ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపించారు. నిజాం ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే అమ్మేయడం సిగ్గుచేటని అన్నారు.
విలువైన భూములను కూడా వేలానికి పెడుతుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే భూములను కాపాడాలని రేవంత్ కోరారు.
చివరి నిజాం చేసిన సేవలకు గుర్తుగా.. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని రేవంత్ కోరారు.
రాష్ట్ర ప్రజలు గర్వించేలా.. గొప్ప కార్యక్రమానికి ముఖరం ఝా పేరు పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
చివరి నిజాం పేరుతో ఎలాంటి కార్యక్రమం ప్రారంభించాలో అసెంబ్లీలో చర్చించాలని తెలిపారు.
నిజాం రాజులు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు.. కొన్ని తప్పులు కూడా చేశారని తెలిపారు.
ఆ తప్పులను కాంగ్రెస్ పార్టీ సమర్ధించదని వివరించారు.
చార్మినార్ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి కల్పించాలని వారి సేవలను రేవంత్ కొనియాడారు.
హైదరాబాద్ ప్రజల సంక్షేమం కోసం.. ఉస్మానియా, నిలోఫర్, కోరంటి దవఖానాలు నిర్మించారని తెలిపారు.
లక్షలాది మందికి విద్యను అందిస్తున్న ఉస్మానియా కాలేజీ నిర్మాణం నిజాం రాజుల గొప్పతనమని అన్నారు.
నిజాం అంత్యక్రియలపై కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి వాటిపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/