Site icon Prime9

Rashmika Mandanna: పెళ్లిపై రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌ – వరుడు ఎవరో కన్‌ఫాం చేసేందిగా!

Rashmika Mandanna Comments on Marriage: నేషనల్‌ క్రష్‌ రష్మిక పెళ్లిపై షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. హీరో విజయ్‌ దేవరకొండతో రిలేషన్‌లో ఉందంటూ కొంతకాలంగా రూమర్స్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ డేట్‌కు వెళ్తూ దొరికిపోతుంటారు. ఇటీవల వీరిద్దరు ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్మిక పెళ్లిపై చేసిన కామెంట్స్‌ వీరిద్దరి డేటింగ్‌ వార్తలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కాగా రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా కిస్సిక్‌ సాంగ్‌ లాంచ్‌ సందర్భంగా చెన్నైలో ఈవెంట్‌ నిర్వహించి విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌, శ్రీలీల, రష్మిక మందన్నాతో పాటు మూవీ మేకర్స్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో స్టేజ్‌పైకి వచ్చిన మాట్లాడిన రష్మికకు ఈవెంట్‌ హోస్ట్స్‌ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఇండస్ట్రీ వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నారా? లేక బయటి వ్యక్తినా అని అడగ్గా… రష్మిక ముసిముసిగా నవ్వింది. ఆ వెంటనే ‘దానికి సమాధానం అందరికి తెలుసు’ చిరు నవ్వులు చిందించింది. ఆమె సమాధానంతో ఒక్కసారిగా ఆటోరియం ఆడియన్స్‌ కేకలతో దద్దరిల్లింది. ఇక అక్కడే కూర్చోని ఉన్న అల్లు అర్జున్‌, శ్రీలీలు కూడా తెలుసు అన్నట్టు నవ్వేశారు. దీంతో రష్మిక కామెంట్స్‌ ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తుంది.

ఇక ఆన్సర్‌కు అంతా అవును తెలుసు.. ది కొండతోనే గా పెళ్లి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారనేది ఒపెన్ సీక్రెట్‌గా ఉన్న అంశం. చాలా సందర్భాల్లో వీరిద్దరు ఇన్‌డైరెక్టర్‌ తమ ప్రేమలో హింట్స్‌ ఇస్తూనే ఉన్నారు. ఏ వెకేషన్‌కి వెళ్లిన అక్కడ వీరి ఫోటోలు బయటకు వస్తుంటాయి. అంతేకాదు సింగిల్‌ సింగిల్‌గా వాటిని షేర్‌ చేయడంతో లోకేషన్‌ బట్టి నెటిజన్స్‌ పట్టేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వారిద్దరు కావాలనే తమ ఫోటోలు షేర్‌ చేసి దొరికిపోతున్నారనేది కొందరి అభిప్రాయం. నేరుగా రిలేషన్‌ని ప్రకటించకుండా.. పరోక్షంగా కన్‌ఫాం చేసేస్తున్నారని ఇండస్ట్రీవర్గాలు కూడా అంటుంటాయి. మరి వీరిద్దరు తమ ప్రేమను ఎప్పుడు ఆఫిషియల్‌ చేస్తారో చూడాలి.

Exit mobile version