Site icon Prime9

Ramayana: రెండు భాగాలుగా వస్తున్న బాలీవుడ్‌ ‘రామాయణ’ – రిలీజ్‌ ఎప్పుడంటే!

Ranbir Kapoor and Sai Pallavi Ramayana Release Date Announced: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ’. ప్రముఖ డైరెక్టర్‌ నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో మేకర్స్‌ అప్‌డేట్స్‌ ఇవ్వడం లేదు.

కనీసం షూటింగ్ అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. పైగా ఇప్పటి వరకు నటీనటుల వివరాలు, లుక్‌ కానీ విడుదల చేయలేదు. ఇటీవల షూటింగ్‌ సెట్‌లో రాముడు, సీతగా గెటప్‌లో ఉన్న రణ్‌బీర్‌, సాయి పల్లవిల ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వని మూవీ టీం ఏకంగా సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

అంతేకాదు ‘రామాయణ’ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్టు వెల్లడిస్తూ వాటి రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించారు. ‘రామయణ’ ఫస్ట్‌ పార్ట్‌ 2026 దీపావళికి, ‘రామయణ 2’ని 2027 విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కాగా రామయణలో రాముడి పాత్రకు రణ్‌బీర్‌ కపూర్‌ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. రాముడి పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నానని, డైట్‌ ఫాలో అవుతున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యేవరకు తాను మద్యపానం మానేసినట్టు చెప్పాడు.

ఇక సాయి పల్లవి.. సీత పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. తాను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన సినిమాల్లో రామయణం ఒకటని, సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం తన భాగ్యం అంది. ఈ పాత్రను నటిగా కాకుండా.. భక్తురాలిగా చేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో యశ్‌ నిర్మించడంతో పాటు ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నట్టు టాక్‌.

Exit mobile version