Site icon Prime9

Ram Pothineni: మహేష్‌ బాబు దర్శకత్వంలో రామ్‌ కొత్త సినిమా – పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయిన RAPO22

RAPO22 Pooja Ceremony

Ram Pothineni RAPO22 Launched With Pooja Pooja Ceremony: ఉస్తాద్‌ రామ్‌ పోతినేని ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ది వారియర్‌, స్కంద వంటి సినిమాలతో డిజాస్టర్‌ చూసిన రామ్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌తో హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఓ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు. ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ మూవీ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే రాపో22(RAPO22) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రకటన వచ్చింది. నేడు ఈ సినిమా హైదరాబాద్‌లో పూజ కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి సీతారామం ఫేం హనురాఘవపూడి, డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని. వెంకీ కుడుముల ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు కార్యక్రమాల్లో భాగంగా చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్‌తో పాటు సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేలు డైరెక్టర్‌ మహేష్‌కు స్క్రిప్ట్ అందజేశారు.

పూజ తర్వాత తొలి సన్నివేశానికి హనురాఘవపూడి క్లాప్‌ కొట్టగా.. గోపిచంద్‌ మలినేని కెమెరా స్విచ్చాన్‌ చేశారు. డైరెక్టర్‌ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించాడు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం రాపో22 పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా రామ్‌ సరసన ‘మిస్టర్‌ బచ్చన్‌’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ఫీల్ గుడ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా #RAPO22 రూపొందనుందని, ఇందులోతన పాత్ర కోసం రామ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. రాపో అన్ని వర్గాలను ఆకట్టుకునే కథ అని వారు పేర్కొన్నారు.

Exit mobile version