Site icon Prime9

Ram Charan : క్యాన్సర్ తో పోరాడుతున్న బాలుడి కోరిక తీర్చిన రామ్ చరణ్.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ 

ram charan meet his little fan boy and wish him speedy recovery

ram charan meet his little fan boy and wish him speedy recovery

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు.

జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

కాగా కేవలం నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఈ నేపథ్యం లోనే మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు రామ్ చరణ్.

 

కాన్సర్ తో పోరాడుతున్న ఒక చిన్నారి కోరికను తీర్చి తన ఉదారతను చాటుకున్నాడు. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న‌ అభిమానులు కొంద‌రు స్టార్ హీరోలను చూడాలని ఉంద‌నే విష‌యాన్ని చెప్పిన‌ప్పుడు, ఆ విష‌యం హీరోల‌కి తెలిసిన‌ప్పుడు వారు వ‌చ్చి ప‌రామర్శించిన ఘటనలను మనం గమనించవచ్చ. అయితే తాజాగా 9 ఏళ్ళ మణి కుశాల్ కాన్సర్ తో బాధ పడుతున్నాడు. గత కొంత కాలంగా హైదరాబాద్ స్పర్శ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్నాడు. కాగా ఇటీవల ఆ చిన్నారి హీరో రామ్ చరణ్ ని కలవాలని ఉందని తన తల్లిదండ్రులతో వెల్లడించాడు.

ఆ విషయాన్ని ‘మేక్ ఆ విష్’ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్ కి సంస్థ నిర్వాహకులు చేరవేశారు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే స్పందించి, తన చిన్నారి అభిమాని కోరికను తీర్చడానికి హాస్పిటల్ కి చేరుకున్నాడు. మణి కుశాల్ తో కొంతసేపు సమయం గడిపి, తనకి ధైర్యం చెప్పాడు. అంతేకాదు తనకి ఒక చిన్న బహుమతి కూడా తీసుకు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండడంతో అభిమానులు చరణ్ చేసిన పనికి శబాష్ అంటున్నారు.

 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న (Ram Charan)ఆర్సీ15..

కాగా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర మొదలైంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  డైరెక్టర్ శంకర్ కీలకమైన సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే ఒక సాంగ్ షెడ్యూల్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ ని దాదాపు 500 డాన్సర్స్ తో చిత్రీకరించనున్నారట. మార్చి 27 చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version