Site icon Prime9

Game Changer Teaser: రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ టీజర్‌ వచ్చేసింది.. బాక్సాఫీస్ దుమ్ము దులపడం ఖాయం!

Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. గత వారం రోజులుగా ‘గేమ్‌ ఛేంజర్‌’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్లోస్లోగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోవడంలో ఫ్యాన్స్‌ అంతా నిరాశలో ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండంతో మూవీ టీం ప్రమోషన్స్‌ జోరు పెంచింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి నేడు(నవంబర్‌ 9) టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఉత్తర ప్రదేశ్‌ లక్నోలో గ్రాండ్‌గా ఈవెంట్‌ని నిర్వహించి అక్కడ ప్రతిభ థియేటర్లో గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. తాజాగా విడుదలైన ఈ టీజర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో చరణ్‌ లుక్‌, ఎలివేషన్స్‌ సీన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. ఐఏఎస్‌ అధికారిగా చరణ్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్‌ మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది.

డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ కియార అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. హీరోయిన్‌ అంజలి మరో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషించారు. శ్రీకాంత్‌, తమిళ నటుడు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాం, సునీల్‌, నాజర్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ని అందించాడు. కాగా గేమ్ ఛేంజర్ మూవీ 2025 జనవరి 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

Exit mobile version