Game Changer New Song Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిడ్ మూవీ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంఇ. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో మూవీ టీం అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది.
డిసెంబర్ 21న డల్లాస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ నాలుగోవ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో శంకర్ మార్క్ కనిపించింది. దోప్ అంటూ సాగే ఈ పాట అపరిచితుడులోని ‘నీకు నాకు నోకియా’ పాటను తలపించింది. రిచ్‌గా,ట్రెండీగా సాగింది. ఇందులో రామ్ చరణ్, కియారా లుక్ ఆకట్టుకుంది. వాక్క వాక్క వాట్సే దోప్.. అంటూ సాగిన ఈ పాటలో తెలుగు పదాలు తక్కువ వినిపించాయి. విజువల్స్ అయితే రిచ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లు బాగా ఆకట్టుకుంది.
అయితే మిగతా పాటల్లా ఈ పాట జనాలకు రీచ్ అవ్వడానికి కాస్తా సమయం పట్టేలా ఉందని ఓ వర్గం ఆడియన్స్ అంటున్నారు. మొత్తానికి ట్రైలర్, ఈ లేటెస్ట్ సాంగ్‌లో శంకర్ తన మార్క్ చూపించారని, వింటేజ్ శంకర్‌ని చూశామంటున్నారు అభిమానులు. రామజోగయ్యశాస్త్రీ రాసిన ఈ పాటను తమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజనిలు ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. చరణ్ డ్యుయేల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని వంటి నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.