Site icon Prime9

Pushpa 2: ఓవర్సిస్‌లో పుష్ప 2 రేర్‌ రికార్డు – అప్పుడే మిలియన్‌ డాలర్ల మార్క్‌, పుష్పరాజ్‌ దూకుడు మామూలుగా లేదుగా

Pushpa 2 Rare Record in USA: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ రికార్డుల వేట మొదలుపెట్టింది. ట్రైలర్‌తో మొదలు రోజుకో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్‌ అత్యధిక వ్యూస్‌ సాధించిన తెలుగు ట్రైలర్‌గా టాప్‌లో నిలిచింది. అంతేకాదు నార్త్‌లో జరిగిన ఈ ట్రైలర్‌ ఈవెంట్‌కు భారీగా జనం తరలి వచ్చారు. మొత్తంగా 2.6 లక్షల మంది లైవ్‌లో ఈ ట్రైలర్‌ని వీక్షించారు. ఒక తెలుగు మూవీ నార్త్‌ బేస్‌లో ఈ రేంజ్‌లో రిస్పాన్స్‌ రావడం మరో అరుదైన రికార్డు.

ఇప్పటి వరకు హిందీ చిత్రాలకు సైతం ఈ స్థాయిలో రెస్పాన్స్‌ రాలేదు. దీంతో పుష్పతో బన్నీ క్రేజ్‌ ఏ స్థాయికి చేరింది ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ బెస్ట్‌ ఎక్సాంపుల్‌. ఇండియాలో ఆల్‌టైం రికార్డులు నెలకొల్పిన పుష్ప 2.. ఓవర్సిస్‌లోనూ తన జోరు చూపిస్తుంది. అక్కడ సరికొత్త రికార్డు దిశగా పుష్ప 2 దూసుకుపోతుంది. ఇప్పటికే మూవీ ప్రీమియర్స్‌కి అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగా.. తాజాగా ప్రీసేల్‌లో వన్‌ మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరింది. ప్రీసేల్‌లో వన్‌ మిలియన్ల మార్క్‌ చేరిన ఫాస్టెస్ట్‌ తెలుగు సినిమాగా ‘పుష్ప 2’ నిలవడం విశేషం.

నెల రోజుల ముందే బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగా.. కేవలం 15 రోజుల్లోనే వన్‌ మిలియన్ల డాలర్ల ప్రీ సేల్‌ బిజినెస్‌ జరగడం పుష్పరాజ్‌ రికార్డే సరికొత్త రికార్టు అంటున్నారు. ఇంకా 15 రోజుల్లో ఇంకేన్ని రికార్డు కొల్లగోడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 వస్తున్న ఈ రెస్పాన్స్‌ చేస్తుంటే రిలీజ్‌ తర్వాత బన్నీ ఇంకేన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని అభిమానులంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చిత్రం తెరకెక్కుతుంది. ముందు నుంచి ఈ చిత్రంపై విపరీతమైన బజ్‌ ఉంది. 2021లో డిసెంబర్‌లో విడుదలైన పుష్ప: ది రైజ్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

మ్యూజిక్‌ పరంగాను విశేష స్పందన అందుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ. 390పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమా ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక ట్రైలర్‌తో ఆడియన్స్‌ అంచనాలు అన్ని నెక్ట్స్‌ లెవల్‌కు చేరుకున్నాయి. మరి డిసెంబర్‌ 5న రిలీజ్‌ తర్వాత పుష్ప 2 అందరి అంచనాలను అందుకుంటుందా? లేదా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Exit mobile version