Site icon Prime9

Pushpa 2: శ్రీలీల ‘కిస్సిక్‌’ సాంగ్‌పై సమంత రివ్యూ – ఏమన్నదంటే..!

Samantha Review on Kissik Song: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కిస్సిక్ సాంగ్ గురించే చర్చ జరుగుతుంది. ఆదివారం విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 25 మిలియన్ల వ్యూస్‌ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా కిస్సిక్‌ సాంగ్‌ రికార్డుకు ఎక్కింది. అయితే పార్ట్ వన్‌లోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా పాట ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో సమంత ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులకి అంతా ఫిదా అయ్యారు.

యూట్యూబ్‌లో సన్సేషనల్‌గా నిలిచిన ఈ పాట ఇప్పటికే పలు ఈవెంట్స్‌, ఫంక్షన్‌లో మారుమోగుతూనే ఉంది. ఇంటర్నేషనల్‌ వేదికలపై కూడా ఈ ఊ అంటావా పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా హిట్‌ ఒక్క ఎత్తయితే.. ఈ స్పెషల్‌ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ మరో ఎత్తు అని చెప్పోచ్చు. అయితే డైరెక్టర్‌ సుకుమార్‌ పార్ట్‌ వన్‌ మించిలా పార్ట్‌ 2లోనూ స్పెషల్ సాంగ్ డిజైన్‌ చేశాడనే అప్‌డేట్‌ వచ్చినప్పటి నుంచి ఈ ఐటెం సాంగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక యంగ్‌ సెన్సేషన్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల ఈ పాట నటిస్తుందని ప్రకటన వచ్చాకు అంచానాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక సాంగ్ నుంచి వచ్చిన కిస్సిక్‌ బీట్‌ మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. అలా ఎన్నో అంచనాల మధ్య మొన్న ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ అంతా ఎగబడి చూశారు. కానీ, పార్ట్‌ 1లోని ఐటెం సాంగ్‌ రేంజ్‌లో ఇది ఆకట్టుకోలేకోపోయింది. ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాలో ఎక్కువమంది చూసిన పాటగా కిస్సిక్‌ నిలిచింది. కానీ, 18 గంటల్లోనే ఈ పాట 28 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి రికార్డు ఎక్కింది. కానీ ఈ పాట మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.

కానీ శ్రీలీల, బన్నీల మాస్‌ డ్యాన్స్‌కు మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. ఇక శ్రీలీల పర్పామెన్స్‌ విషయానికి వస్తే ఫుల్ వీడియో సాంగ్‌ చూస్తే కానీ చెప్పలేం అంటున్నారు. కానీ, ఊ అంటావా మావ పాటను మాత్రం కిస్సిక్‌ సాంగ్ బీట్‌ చేయలేకపోయిందనే కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పాట చూసిన సమంత శ్రీలీల కుమ్మెసిందంటూ కామెంట్‌ చేసింది. ఈ పాట స్క్రిన్‌షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ ” శ్రీలీల చంపేశావ్‌” అంటూ మూడు ఫైర్‌ ఎమోజీలను జత చేసింది. అలాగే పుష్ప 2 కోసం వెయిట్‌ చేయండి అని పేర్కొంది.

Exit mobile version