Site icon Prime9

Pushpa 2: అప్పుడే ఓటీటీకి ‘పుష్ప 2’ – చెప్పిన టైం కంటే ముందే స్ట్రీమింగ్‌?

Pushpa 2 OTT Streaming Date and Time: ‘పుష్ప 2’ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్‌ హీరో సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైంది. ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తుంది. అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డు క్రియేట్‌ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటిన ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద అదే జోరు చూపిస్తుంది. ఫలితం సినిమా మూడు వారాల్లో రూ. 1508 కోట్ల గ్రాస్‌ చేసింది. ఇంకా పుష్ప 2 వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇందులో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ నెక్ట్స్‌ లెవల్‌ అనే చెప్పాలి.

‘పుష్ప 2’ని వన్‌ మ్యాన్‌ షోగా ముందుకు తీసుకువెళ్లాడు. బన్నీ యాక్టింగ్‌, ఇంటెన్సీ పర్ఫామెన్స్‌కి థియేటర్లో ఈళలు పడుతున్నాయి. బాక్సాఫీసు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప 2 ఓటీటీకి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పుష్ప 2 విడుదలై మూడు వారాలు అవుతుంది. కానీ, ఇప్పటికే థియేటర్లో ఈ సినిమా సక్సెస్‌ ఫుల్‌ కొనసాగుతుంది. కలెక్షన్స్‌ కూడా బాగానే చేస్తుంది. ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ ఈ సినిమా బ్రహ్మరథం పడుతున్నారు. వరల్డ్‌ వైడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీకి రావడానికి ఆలస్యం అవుతుందని అంతా అభిప్రాయపడ్డారు.

రెండు నెలల తర్వాత డిజిటల్‌ ప్రీమియర్స్‌కి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ తాజా బజ్‌ ప్రకారం పుష్ప 2 థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేలా కనిపిస్తుందట. కాగా 2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప: ది రైజ్‌ సినిమాకు ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్‌ భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు పుష్ప 2ని కూడా అలాగే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కి ఇవ్వాలని మేకర్స్‌ భావిస్తున్నారట. కాగా పుష్ప 2ని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్సీ రేట్‌కి పుష్ప 2 రైట్స్‌ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌ నెల రోజుల్లో మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకుందట.

కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌, హిట్‌ కొట్టడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం పుష్ప 2ను త్వరలోనే స్ట్రీమింగ్‌కి ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్‌ అనుకుంటుందట. అంటే సినిమా థియేటర్లో ఉండగానే ఇటు డిజిటల్‌ ప్రీమియర్‌కి ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయించినట్టు టాక్‌ వినిపిస్తుంది. సంక్రాంతికి ముందే సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే జవవరి 9 లేదా 10న పుష్ప 2ను స్ట్రీమింగ్‌ ఇవ్వనుందని టాక్‌. దీనిపై ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేదు. క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version