Site icon Prime9

kissik Song: ‘పుష్ప 2’ కిస్సిక్‌ సాంగ్‌ వచ్చేసింది

Pushpa 2 kissik song out

Kissik Song Release: ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు కనిపించని బజ్‌ పుష్ప 2కి కనిపిస్తుంది. గత కొద్ది రోజులు ఎక్కడ చూసి వైల్డ్‌ ఫైర్‌ అంటూ పుష్ప 2 గురించే చర్చించుకుంటున్నారు. మూవీ టీం కూడా ఆ రేంజ్‌లోనే ప్రమోషన్స్‌ చేస్తుంది. ఆడియన్స్‌లో రోజురోజులో ఆసక్తి పెంచుతూ సరికొత్త అప్‌డేట్స్‌ వదులుతుంది. ట్రైలర్‌తో మూవీ అంచనాలను రెట్టింపు చేశారు. ఇప్పుడు రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండగా.. ఐటెం సాంగ్ రిలీజ్‌ చేసి మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ఇవాళ చెన్నైలో నిర్వహిస్తున్న ప్రమోషనల్‌ ఈవెంట్‌లో కిస్సుక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. కాగా పార్ట్‌ వన్‌లో సమంత నటించిన ‘ఊ అంటావా మావా’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ పాట ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇందులో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌, బన్నీ మాస్‌ స్టెప్పులకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఇక థియేటర్లో అయితే ఊ అంటావా మావా జోష్‌ ఓ రేంజ్‌లో కనిపించింది. దీంతో పార్ట్‌ 2లోను అంతకు మించి అనేలా స్పెషల్‌ సాంగ్‌ను డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌ సుకుమార్‌. ఆ జోష్‌ను మరింత రెట్టింపు చేసేందుకు డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీలనే రంగంలోకి దింపాడు.

కిస్సిక్‌ అంటూ సాగిన ఈ పాటను ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. ఇందులో శ్రీలీల గ్రేసింగ్‌ స్టెప్స్‌, బన్నీ మాస్‌ డ్యాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరో లెవల్‌కు తీసుకువెళ్లింది. అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యర్నేనీ, రవి శంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ భన్వర్‌ సింగ్‌ షెకవత్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్‌ వంటి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Exit mobile version