Site icon Prime9

Telangana assembly: అసెంబ్లీ వేదికగా కడియం అసభ్య పదజాలం

Profanity at Telangana assembly platform

Profanity at Telangana assembly platform

Profanity at Telangana assembly platform: రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ వాడి వాడి చర్చతో ప్రారంభమైంది. ఈటెల రాజేందర్ ను సభ నుండి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ శాసనసభా సమావేశాలు మొత్తానికి ఆయన్ను బహిష్కరించారు. మరో వైపు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై ఏకవచనంతో ఏకిపారేశారు.

హైదరాబాదు, తదితర ప్రాంతాల్లో పలు కేంద్ర విద్యా సంస్ధలు ఉన్న విషయాన్ని మరిచిన కడియం విభజన సమయంలో ఏపికి కేంద్ర విద్యాసంస్ధలను నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని దుయ్యబట్టారు. తెలంగాణాకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని కేంద్ర తప్పిదంగా పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడుపై ఎలాంటి మాటలు చేయని కడియం అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. నాడు కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్య ఎపికి రావాల్సిన అన్ని దగ్గరుండి రప్పించారంటూ, కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నారు? గడ్డి పీకుతున్నారా అంటూ అసభ్యంగా మాట్లాడారు.

బీజేపి నేతలు, కేంద్ర మంత్రులు చేతకాని చవటలు, సన్యాసులు, దద్దమ్మలు అంటూ కడియం నిసిగ్గుగా మాట్లాడారు. తొలి తెలంగాణ సిఎం దళితుడు అన్న కెసిఆర్ మాటలను మరిచిన కడియం కేంద్ర తెలంగాణాపై వివక్ష చూపుతుందని రాజకీయంగా మాట్లాడారు. కులాలు, మతాలు మద్య చిచ్చుపెట్టి చలి కాచుకుంటామని కేంద్ర భావిస్తే, తెలంగాణ ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. బీజెపీ ముక్త భారత్ కావాలి, కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ ప్రజ సమస్యలు చర్చించాల్సిన ఎమ్మెల్సీ కడియం చివరకు రాజకీయ అంశానికి ముడిపెడుతూ సమావేశం ముగించారు.

Exit mobile version