Site icon Prime9

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ #OG సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన మలయాళీ ముద్దుగుమ్మ..

priyanka arul mohan confirmed as heroin in pawan kalyan og

priyanka arul mohan confirmed as heroin in pawan kalyan og

Pawan Kalyan OG : పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు కొంత బ్రేక్ ఇచ్చి షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు పవన్. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. కాగా పవన్‌ కళ్యాణ్, సాహో డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌ (వర్కింగ్‌ టైటిల్‌). పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ముంబైలో ప్రారంభమవుతుందని సమాచారం. ముంబైతో పాటు కొన్ని ఫారన్ లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తిచేస్తారట. అయితే, ముంబై షూట్ కోసం పవన్ కళ్యాణ్ సింగిల్‌గా వెళ్లడం లేదు. హీరోయిన్‌ను వెంటబెట్టుకుని వెళ్లబోతున్నారు. ఈ మేరకు హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది.

పవన్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ (Pawan Kalyan OG)..

ఈ సినిమాలో పవన్‌ సరసన హీరోయిన్‌గా గ్యాంగ్‌ లీడర్‌ ఫేం ప్రియాంక అరుల్‌ మోహన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా రానుందట. అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ షూటింగ్ మరో వారం రోజులు జరుగుతుందట. అనంతరం  పవన్ కళ్యాణ్, ప్రియాంక ఇద్దరూ వచ్చే వారం చిత్రీకరణలో జాయిన్‌ కానున్నారట. ముంబైలో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరగనుందని సమాచారం అందుతుంది. ఈ సినిమాకు ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటి వరకు హీరో, డైరెక్టర్, నిర్మాత, సంగీత దర్శకుడు మినహా సినిమాకు సంబంధించి ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు.

కాగా న్యాచురల్‌ స్టార్‌ నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయమైంది ప్రియాంక. ఆ  తర్వాత శర్వానంద్‌ శ్రీకారం సినిమాలో నటించింది. చేసింది రెండు సినిమాలే అయినా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. కోలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకెళుతోంది ఈ భామ. శివ కార్తికేయన్‌ డాక్టర్‌, డాన్‌, సూర్య ఈటీ తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’, తమిళ దర్శకుడు ఎం. రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలోనూ నటిస్తూ ఉంది.

సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అది ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 28న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ కొంత పూర్తి అయ్యింది.

Exit mobile version