Site icon Prime9

Salaar 1: ‘సలార్‌ 1’ నన్ను నిరాశపరిచింది – ప్రశాంత్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్‌

Prashanth Neel About Salaar 1: సలార్‌ పార్ట్‌ 1 ఫలితంపై తాను సంతోషంగా లేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ హీరోగా మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటి ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్‌ 22న సలార్‌ పార్ట్‌ వన్‌: సీజ్‌ ఫైర్‌ రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఓ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సలార్‌ రిజల్ట్‌పై తను అంత సంతోషంగా లేనన్నారు.

“సలార్‌ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఫస్ట్‌ పార్ట్‌ కోసం చాలా కష్టపడ్డాను. సినిమాలో కేజీయఫ్‌ 2 ఛాయలు కనిపించాయి. అది నన్ను నిరాశ పరిచింది. సెకండ్‌ పార్ట్‌లో ఆ తప్పులు లేకుండ జాగ్రత్త పడుతున్నా. సలార్‌ 2ని నా కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా తీస్తాను. ప్రేక్షకుల ఊహలకు మించిపోయేలా ఆ సినిమా తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్పిడెంట్‌గా ఉంటాను. అందులో ‘సలార్‌ 2’ ఒకటి” అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇక ప్రశాంత్‌ నీల్‌ చెప్పినట్టుగానే సలార్‌ పార్ట్‌ వన్‌లో కేజీయఫ్‌ ఛాయలు ఉన్నాయంటూ ఓ వర్గం ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ వచ్చాయి. అలాగే మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ రేంజ్‌ కలెక్షన్స్‌ చేయలేకపోయింది. ఈ సినిమా మొత్తంగా రూ. 700లకు పైగా కోట్లు రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాలు అంచన వేశాయి. కానీ సలార్‌ మూవీకి ఓటీటీ భారీ రెస్పాన్స్‌ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది.

ఇక సలార్‌ 2: శౌర్యంగ పర్వం కోసం ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ రావడానికి ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ ఎన్టీఆర్‌ మూవీకి వర్క్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమం కూడా జరిగింది. 2025 ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్‌ మూవీని సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు ప్రశాంత్‌ నీల్‌. ఇకపోతే ప్రభాస్‌ కూడా రాజాసాబ్‌, కల్కి 2 సినిమాలతో బిజీగాఉన్నాడు.

Exit mobile version