Site icon Prime9

Prabas Rebel: థియేటర్లలోకి “రెబల్” మళ్లీ వచ్చేస్తున్నాడు..!

rebel movie re release

rebel movie re release

Prabas Rebel: టాలీవుడ్ నాట రీరిలీజ్ ల​ ట్రెండ్ కొనసాగుతోంది. ఇది వరకే మహేశ్​​ బాబు ‘పోకిరి’, పవన్​ కల్యాణ్​ ‘జల్సా’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలు రీరిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకాదారణ పొందాయి. థియేటర్లలోనూ భారీగా కలెక్షన్లు సాధించి పెట్టాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌భాస్ నటించిన ‘రెబెల్’ ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతుంది.

డాన్స్ మాస్టర్ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబెల్’ సినిమా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ప్ర‌భాస్​ సరసన తమన్నా నటించారు. ఈ మూవీలో ఇటీవలే మరణించిన రెబల్​ స్టార్​ కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ సినిమా అప్పుట్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. ‘రెబెల్‌’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వంతో పాటు సంగీతాన్ని కూడా లారెన్స్ అందించారు. ఈ చిత్రం విష‌యంలో నిర్మాత‌ల‌కు లారెన్స్‌తో విభేదాలు వ‌చ్చాయని అప్పట్లో వార్తలు కూడా తెగ హల్చల్ చేసాయి. అయితే అక్టోబరు 15న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్ కానుంది.

ఇదీ చదవండి: వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు.. నెట్టింట సమంత పోస్ట్ వైరల్

Exit mobile version