Site icon Prime9

Prabhas : ఆ స్టార్ హీరోతో కలిసి బాలకృష్ణ అన్‏స్టాపబుల్ షో కి వచ్చిన ప్రభాస్… పిక్స్ వైరల్

prabhas-participated-in-balakrishna-unstoppable-show-with-gopichand

prabhas-participated-in-balakrishna-unstoppable-show-with-gopichand

Prabhas : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రస్తుతం అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. తన కెరీర్ లో తొలిసారి హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో దుమ్ము రేపుతుంది. ఇప్పటికే తొలి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ లో కూడా అదే ఫామ్ ని కొనసాగిస్తున్నారు. సెకండ్ సీజన్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఊహించని వ్యక్తులను గెస్ట్ లుగా ఆహావణిస్తున్నారు బాలకృష్ణ.

రెండో సీజన్ తొలి ఎడిసోడ్ లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత యంగ్ హీరోల తోనే క్రేజీ ముచ్చట్లు చెప్పి అదరగొట్టారు. కాగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను అన్ స్టాపబుల్ షోకి తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ కి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆహా నిర్వాహకులు.

ప్రభాస్ బాలయ్య షో లో పాల్గొనబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఏ మేరకు ప్రభాస్, బాలకృష్ణ తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. పలు వెబ్ సైట్లలోనూ ఈ ఫోటోలను ప్రచురించారు. ఇక ఇదే ఊపులో తాజాగా ఈ టాక్ షో నిర్వాహకులు ప్రభాస్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఫోటోలను రిలీజ్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ ఫొటోల్లో ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు , ప్రముఖ హీరో గోపీచంద్ కూడా ఉండడం అభిమానులను మరింత సంతోషాన్ని కలగజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. దానితో పాటు ట్విట్టర్ లో ‘మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది’ అని పోస్టవ్ చేశారు.

Exit mobile version