The Script Craft Website Launched For Writers: సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది ఆశ పడుతుంటారు. ముఖ్యంగా రచయితగా, డైరెక్టర్స్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ ప్రతిభను ఇండస్ట్రీలో చూపించాలనుకుంటున్నారు. అయితే అలాంటి వారిని ప్రోత్సహిస్తూ తాజాగా “ది స్క్రిప్ట్ క్రాప్ట్” అనే వెబ్ సైట్‌ను లాంచ్ అయ్యింది. ప్రతిభ గల రచయితలను, డైరెక్టర్స్ ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వెబ్ సైట్‌ను తీసుకువచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల తాజాగా ఈ వెబ్ సైట్ లాంచ్ అయ్యింది. ఆయన సోషల్ మీడియా వేదికగా వెబ్‌సైట్‌ని ప్రారంభించారు.
‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్, టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నానికి ప్రభాస్ తన వంతు మద్ధతును అందిస్తూ తన చేతుల మీదుగా వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా రచయితలు తమ స్క్రిప్ట్‌ను 250 పదాల నుంచి 3500 వరకు ఏదైన స్టోరీ రాసి ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. వీక్షకులు మీ స్టోరీ చదివిన తర్వాత తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్‌ని రూపొందించారు. అలా అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్‌లను టాప్ ప్లేస్‌లో ఉంచబోతున్నారు. తమ రచనకు వచ్చే రేటింగ్ రైటర్స్ కాన్ఫిడెన్స్ పెంచనుంది.
‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ మొదటి ప్రయత్నంగా రచయితలకు మీ ఫేవరేట్ హీరోకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ లను ఇన్వైట్ చేస్తోంది. దీనిపై స్క్రిప్ట్ రాసి ఈ సైట్ ద్వారా రైటర్, అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చు. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా తమ కథలను రైటర్స్ ఆడియో బుక్స్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల తమ స్క్రిప్ట్ లను మరింత మందికి చేరువయ్యేలా రైటర్స్ చేసుకోవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం ఆసక్తి ఉన్న వాళ్లు మీ అభిమాన హీరోలకు కథలు రాసి ఈ వెబ్ సైట్లో అప్‌లోడ్ చేసి ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోండి.