Site icon Prime9

Prabhas: షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం! – పోస్ట్‌ వైరల్‌

Prabhas injured

Prabhas Injured in Shooting: ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. చివరిగా కల్కి 2898 ఏడీ పార్ట్‌ 1 చిత్రంతో అలరించిన ప్రభాస్‌ ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనే అప్‌డేట్‌ లేదు. అయితే ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు ప్రభాస్‌ ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించని ఓ చేదు వార్త తెలిసిందే. డార్లింగ్‌ ప్రస్తుతం విశ్రాంతి మోడ్‌లో ఉన్నాడట. ఇటీవల షూటింగ్‌ సెట్‌లో గాయపడ్డాడని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్‌ పేరుతో ఉన్న ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా నాగ్‌ అశ్వీన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ పాన్‌ ఇండియా చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ ఏడాది మేలో కల్కి ఫస్ట్‌ పార్ట్‌ విడుదలైంది. ఆ వెంటనే మూవీ టీం పార్ట్‌ 2 షూటింగ్‌ని మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు కల్కి 2898 ఏడీ జపాన్‌ ఆడియన్స్‌ని అలరించేందుకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది జనవరి 3న కల్కి జపాన్‌లో రిలీజ్‌ కానున్న సందర్భంగా కల్కి టీం జపాన్‌లో ప్రమోషన్స్‌ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ప్రభాస్‌ ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. జపాన్‌ ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. తాను అక్కడ ప్రమోషన్స్‌ రావడం లేదంటూ ఇచ్చిన ఓ ప్రకటనకు సంబంధించి స్క్రీన్‌ షాట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

నాపై మీరు కురిపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ఎంతోకాలంగా జపాన్‌ ప్రేక్షకులను కలవాలని అనుకుంటున్నా. ఈ క్రమంలో కల్కి రిలీజ్‌ సందర్భంగా వెళ్లాలని అనుకున్నాను. కానీ, షూటింగ్‌లో నా మడిమ కాలికి గాయమైంది. దానివల్ల జపాన్‌లో ప్రమోషన్స్‌కి రాలేకపోతున్నా. క్షమించండి” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చినట్టు ఉంది. అయితే ఇది స్వయంగా ప్రభాస్‌ రిలీజ్‌ చేశాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. కానీ ప్రభాస్‌కు గాయమని తెలియగానే అతడి ప్యాన్స్‌ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎంతోకాలంగా ప్రభాస్ కాలు గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్‌ టైంలో ఈ గాయం తిరగబడగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే కాలికి గాయమైనట్టు తెలుస్తోంది.

Exit mobile version