Site icon Prime9

Aadipurush : అరుదైన ఘనత దక్కించుకున్న ప్రభాస్ “ఆదిపురుష్”.. రిలీజ్ కి ముందే అక్కడ ప్రదర్శన

prabhas aadipurush movie going to screening at tribeca film festival

prabhas aadipurush movie going to screening at tribeca film festival

Aadipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో 5,6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆదిపురుష్ Aadipurush..

న్యూయార్క్ వేదికగా ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ 2023 జరగనుంది. జూన్ 7 నుండి 18 వరకు వివిధ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రఖ్యాత వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆదిపురుష్ అర్హత సాధించింది. ట్రిబెక 2023 నందు ఆదిపురుష్ చిత్ర ప్రదర్శన జరగనుంది. జూన్ 13న ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ నందు ఆదిపురుష్ మూవీ ప్రీమియర్ వేయనున్నారు. సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ  ఫెస్టివల్ లో ప్రభాస్ సినిమా ప్రదర్శించబోతుండడం పట్ల ఆయన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ప్రభాస్ నటించిన ఈ చిత్రం కూడా అరుదైన ఘనత సాధించడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభాస్ ను అభినందిస్తున్నారు. అలానే ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

 

 

అయితే ఇటీవలె శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగల సందర్భంగా  ఆదిపురుష్ నుంచి విడుదలైన సరికొత్త పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పోస్టర్లో ప్రభాస్ శ్రీరాముడిగా  కృతి సనన్ సీతగా.. లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. అలానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అదే విధంగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.

Exit mobile version