Site icon Prime9

Ponniyan Selvan 2 : “పొన్నియన్ సెల్వన్ 2” ఆడియో, ట్రైలర్ లాంఛ్ కి ముహూర్తం ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా ఎవరంటే?

ponniyan selvan 2 audio and trailer launch event date fixed

ponniyan selvan 2 audio and trailer launch event date fixed

Ponniyan Selvan 2 : లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించినబడిన చిత్రం “పొన్నియన్ సెల్వన్”. రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. 30 సెప్టెంబర్ 2022న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో..  చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌ రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి భారీ తారాగణం నటించడం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కాగా ఇప్పుడు సౌత్ నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పొన్నియన్‌ సెల్వన్  విడుదలై ఘన విజయం సాధించింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇప్పడు ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గ్రాండియర్ గా.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్.. ఎమోషన్స్ తో ప్రేక్షకులను మంచిగా ఆదరించింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో కూడా ఎమోషన్స్ తో పాటు సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు తాజాగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది చిత్ర బృందం.

ఈ మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ ని  మార్చ్ 29న సాయంత్రం 6 గంటలకి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ చీఫ్ గెస్టుగా రానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని  కూడా రిలీజ్ చేశారు.  గతంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మ్యూజిక్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి అటెండ్ అయ్యారు. దీంతో ఆ సినిమాకి సాలిడ్ బజ్ వచ్చింది, ఇప్పుడు రజినీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో కమల్ హాసన్ మాత్రమే అటెండ్ అవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

 

Exit mobile version