Ponguleti Srinivas Reddy: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ponguleti Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైరా నియోజక వర్గంలో తన అనుచరులను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై విరుచుకుపడ్డారు.

సస్పెండ్ చేయాలి అనుకుంటే తనను చేయాలని.. అంతేకానీ తన అనుచరులను చేయడం ఏంటని ధ్వజమెత్తారు.

ఎప్పుడెప్పుడు తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

 

అపుడు నా సభ్యత్వం గుర్తుకు రాలేదా..? (Ponguleti Srinivas Reddy)

 

‘నాకు పార్టీలో సభ్యత్వం లేదని చెప్పేవాళ్లు మొన్నటి వరకు ఫ్లెక్సీలపై ఫోటోలు ఎలా పెట్టుకున్నారు.

నాతో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నప్పుడు నా సభ్యత్వం గుర్తుకు రాలేదా..? ఆత్మీయ సమావేశాలకు హాజరైన వారిని సస్పెండ్ చేయడం కాదు..

దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఒక్కడినే కాదు..సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెప్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎలా తెచ్చుకున్నామో గుర్తించుకోవాలి.

అధికారం ఎవడబ్బా సొత్తు కాదు. అధికారులందరికీ ఓక హెచ్చరిక. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఈ స్థాయికి రావడానికి ఏమి ఇచ్చుకున్నారో మీరే ఆలోచించుకోండి.

అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు. నా అనుచరులనున ఎవరినైనా ఇబ్బంది పెడితే వడ్డీ కాదు చక్ర వడ్డీతో తీరుస్తా.

ఇక రాబోయే ఎన్నికల్లో అశ్వారావు పేట అభ్యర్థిగా జారె ఆదినారాయణ బరిలో ఉంటారు. ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీని శ్రీనివాస్ రెడ్డి శాసిస్తాడు.

నేను ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారు.

 

చర్చ పెడదామంటే నేను రెడీ

 

నాకు ఇచ్చిన పనులన్నీ దొడ్డి దారిలో ఇచ్చి ఉంటే 2 లక్షల కోట్ల పనులు కూడా దొడ్డి దారినే ఇచ్చారా..? చర్చ పెడదామంటే నేను రెడీ.

కాంట్రాక్టు ఇచ్చి ఎవరు ఎంత పొందారో వివరించి చెబుతా. ప్రతి గ్రామ పంచాయితీలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

అనేక మంది పేద సర్పంచ్లు భార్యల మెడలో పుస్తెలు అమ్ముకుంటున్నారు.

ప్రతి పంచాయితీకి రూ. 10 లక్షలు, మున్సిపాలిటీలకు రూ. 20 లక్షలు ఇస్తాం అని చెప్పి ఎక్కడా నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/