Site icon Prime9

PM Modi: ఆనాటి గుజరాత్ పరిస్థితిని గుర్తు చేసుకుని.. కన్నీటి పర్యంతమైన ప్రధాని మోదీ

PM Modi

PM Modi

PM Modi: భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి.

ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.

భూకంప తీవ్రతకు ఎన్నో బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. ఎటూ చూసిన హృదయ విదాకర దృశ్యాలే..ఈ భూకంపం సృష్టించిన విలయానికి ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి.

అంతా కోల్పోయి వారంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

 

గుజరాత్  భూకంపాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని (PM Modi)

కాగా, టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాల్లో వేల మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పార్లమెంట్ లో మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని 2001 లో గుజరాత్ లో వచ్చిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మీడియాతో పంచుకున్నారు.

బీజేపీ పార్లమెంటరీ సమావేశం పార్లమెంట్ జరిగిందని.. టర్కీ, సిరియా లో ప్రకృతి విలయం వల్ల జరిగిన విధ్వంసం గురించి నరేంద్ర మోదీ వివరించారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీరు పెట్టుకున్నారన్నారు.

2001 లో గుజరాత్ లో భూకంపం వచ్చి.. ఎంతో నష్టం జరిగిన విషయాన్ని మోదీ గుర్తుచేసుకుని బాధపడ్డారని తెలిపారు.

అప్పటి గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13 వేల మంది ప్రాణాలు కొల్పోయిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు.

'Thought It Was Apocalypse': Fear Of Aftershocks In Earthquake-Hit Turkey

సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ (PM Modi)

టర్కీ, సిరియా దేశాలను ఆదుకునేందుకు అనేక దేశాలు సాయం అందించేందకు ముందుకు వచ్చాయి. అలాగే భారత్ కూడా అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటించింది.

ఈ మేరకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధం ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.

ఈ నేపథ్యంలో టర్కీ లో తక్షణ సహాయక చర్యల నిర్వహణకు భారత్ 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వైద్య సిబ్బందిని , సహాయ సిబ్బందితో పాటు ఇతర అవసరమైన

సామాగ్రిని పంపింది.

టర్కీ ప్రభుత్వం, అంకారాలోని భారత రాయబార కార్యాలయం, ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోనుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar