PM Kisan installment: రైతులకు శుభవార్త.. దీపావళిలోగా ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధి

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.

PM Kisan Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.

పీఎం కిసాన్ పథకం 12వ విడత రూ.2,000ను అర్హులైన రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్టు మోదీ ప్రభుత్వం వెల్లడించింది. అగ్రి స్టార్టప్, కిసాన్ సమ్మేళన్ రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం ఈ ప్రకట వెలువరించింది. ఈ నెల 17వతేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ రూ. 2వేలను బదిలీ చేయనున్నట్టు కేంద్ర అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఈ పథకానికి సంబంధించిన డబ్బును జమ చేయవచ్చని గతంలో కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కాగా తాజాగా దీపావళికి ముందు ఈ డబ్బును మంజూరు చేయనున్నట్టు కేంద్రం నిర్ణయించింది. మే 31న మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని విడుదల చేసిన సంగంతి తెలిసిందే. కాగా ఈ పథకం కింద గతంలో 10కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 21 కోట్ల నిధులను మంజూర చేసింది ప్రభుత్వం

ఇదీ చదవండి: ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు