Site icon Prime9

Biryani: బిర్యానీ పంచాయితీ.. అర్ధరాత్రి హోం మంత్రికి ఫోన్ కాల్

phone call to home minister for biryani

phone call to home minister for biryani

Biryani: ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అనే ఒకపాట ఉలవచారు బిర్యాని సినిమాలో మనం వినే ఉంటాం. ఈ మాటను కొందరు నిజం చేస్తుంటారు. అచ్చంగా తినడానికే బ్రతుకుతున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో రాత్రిపగలు తేడాలేకుండా కొందరు భోజన ప్రియులు 24గంటలు తినేందుకు వెచ్చిస్తారు. అయితే గత రాత్రి ఇలాంటి వారే ఒకరు బిర్యానీ కోసం పాతబస్తీలో హల్చల్ చేశారనుకోండి. ఇదెక్కడి దాకా వెళ్లిందంటే బిర్యానీ కోసం ఆ సమయంలో తెలంగాణ హోం మంత్రికే ఫోన్ చేసేశారు. మరి ఎందుకు ఇలా చెయ్యాల్సి వచ్చిందో ఓ సారి ఈ కథనం చూసెయ్యండి

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పాతబస్తీలో బిర్యానీ ఫైట్ రాష్ట్రమంతా కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీకి ఫోన్‌ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్‌ చేసి ఎన్ని గంటల వరకు హోటల్‌ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు.
దానికి మహమూద్‌ అలీ స్పందిస్తూ నేను హోంమంత్రిని హోటల్ వాడిని కాదు, నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి సమయంలో ఫోన్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతివ్వాలంటూ ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ సీపీని కలిసారు.

ఇదీ చదవండి: హైద‌రాబాద్‌కు ఎల్లో అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Exit mobile version