Site icon Prime9

Pawan Kalyan: పవన్…విశాఖ పర్యటన వాయిదా వేసుకో…మంత్రి అమర్నాధ్

Pawan. Postpone Visakha visit.. Minister Amarnath

Pawan. Postpone Visakha visit.. Minister Amarnath

Minister Amarnath: జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాధ్ విజ్నప్తి చేశారు. ఈ నెల 15న వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ గర్జన ర్యాలీ చేపడుతున్న నేపధ్యంలో మంత్రి అమర్నాధ్ పవన్ ను కోరారు.

ఈ నెల 15,16 తేదీల్లో పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టనున్నారు. తొలి రోజు ఉత్తరాంధ్ర జనసేన నేతలతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రెండో రోజు ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమాన్ని పవన్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పవన్ కు మంత్రి ఈ మేరకు విజ్నప్తి చేశారు.

విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖకు వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పొడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ అజ్నాత వాసి కాదు, అజ్ణాన వాసిగా మంత్రి అమర్నాధ్ దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి:MP Vijayasai Reddy: విశాఖలో నాకు భూములు లేవు.. విజయసాయిరెడ్డి

Exit mobile version