Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తి నిర్మిస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.
గతంలోనే పూజాహెగ్డే ఒక హీరోయిన్ అని హరీష్ శంకర్ హింట్ ఇచ్చాడు. అయితే మరో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుందని చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ స్పాట్ లో పవన్ కొంతమంది అభిమానులతో ఫోటోలు దిగారు. అలానే షూటింగ్ స్పాట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, సుజిత్ తో #OG, సాయి తేజ్ తో కలిసి చేస్తున్న వినోదాయ సిత్తం చిత్రాలు ఉన్నాయి. కాగా రాజకీయాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పవన్ ఇప్పుడు ఈ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల సాయి తేజ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2024 ఎలక్షన్స్ లోపు ఈ చిత్రాలన్నీ ముగించేయాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. పవన్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్స్ లో బిజీగా ఉన్నాడు.
అయితే తేరి సినిమాలోని పాప, మహిళలకు సంబంధించిన సెంటిమెంట్ అంశాలను.. భవదీయుడులోని పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్‌ని మిక్స్ చేసి `ఉస్తాద్ భగత్ సింగ్`గా హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే తేరి సినిమాలో కథ ప్రకారం విజయ్, సమంతకి ఓ పాప ఉంటుంది. అందులో ఆ పాపగా నటి మీనా కూతురు నటించింది. అందుకు గాను మరి తెలుగులో పవన్‌కి కూతురుగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏఈ వార్త బయటికి రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు గాను బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. పవన్ సినిమాలలో బాలనటిగా, పైగా ఆయన కూతురిగా అంటే ఎంతటి పేరొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.