Site icon Prime9

Pawan Kalyan: ఇప్పట్టం గ్రామంలో పర్యటించనున్న జనసేనాని.. అరెస్ట్ ఖాయమేనా..?

pawan-kalyan tour to ippatam village in guntur

pawan-kalyan tour to ippatam village in guntur

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ నేడు ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలోని 53ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం నాడు రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో జనసేన అభిమానులకు చెందిన కొందరు ఇళ్లను కూల్చివేయడం జరిగిందని జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలోని ఇప్పటం గ్రామంలో నిన్న అధికారులు ఇళ్ల కూల్చివేతల పర్వం మొదలుపెట్టారు. గ్రామంలోని స్థానికులు కోరుకోకపోయినా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారు. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ గతంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభకు గానూ తమ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ స్థలాలను ఇచ్చారు.

ఇందుకు ప్రతిఫలంగా ఆ సభలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ అభివృద్ధికి 50 లక్షల సాయం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు.. తమకు స్థలం ఇచ్చారనే అధికార యంత్రాంగం కూల్చివేతలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ ను అరెస్ట్‌ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్ల సుపారీతో బిగ్ డీల్

Exit mobile version