Site icon Prime9

Pawan Kalyan : కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, సుదీప్ ని క్షమించమని కోరిన పవన్ కళ్యాణ్.. రీజన్ ఏంటంటే ?

pawan kalyan sorry to upendra and sudeep about kabzaa movie

pawan kalyan sorry to upendra and sudeep about kabzaa movie

Pawan Kalyan : ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న మూవీ ‘క‌బ్జా’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్లపై తెలుగులో రిలీజ్ అవుతుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో క‌బ్జా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. 1947 నుంచి 1984 కాలంలో న‌డిచే క‌థ‌ ఇది. స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు కొడుకు మాఫియా వ‌రల్డ్‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌ర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడ‌నే క‌థాంశంతో క‌బ్జ‌ా సినిమాను తెర‌కెక్కించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. శ్రియా, కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్‌, సముద్ర‌ఖ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, కృష్ణ ముర‌ళి పోసాని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటంటే (Pawan Kalyan)..

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఈ సినిమా గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. కబ్జా ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా పిలిచినందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. అయితే అనుకోని విధంగా ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నందకు బాధపడుతున్నాను. పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్నందు వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను అన్నారు. ఇక కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు పవర్ స్టార్ రాసుకొచ్చారు. ఈ ప్రెస్ నోట్ ను ఇంగ్లీష్, కన్నడ భాషలలో రిలీజ్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను ఉపేంద్ర, సుదీప్ జోరుగా సాగిస్తున్నారు. ఉపేంద్రకు ఆయన సినిమాలకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉపేంద్ర, రక్త కన్నీరు, పలు సినిమాలతో టాలీవుడ్ లో వేరే లెవెల్ క్రేజ్ ఉపేంద్ర సొంతం అని చెప్పాలి. ఇక సుదీప్ కూడా హీరోగానే కాకుండా.. నెగెటీవ్ పాత్రలు కూడా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయారు. ఈ క్రమంలోనే కబ్జా సినిమాకు ఈ ఇమేజ్ ఉపయోగపడుతుంది అని నమ్మకంతో ఉన్నారు టీమ్.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version