Site icon Prime9

Kushi Re Release : థియేటర్లను దద్దరిల్లిస్తున్న పవన్ కళ్యాణ్ “ఖుషి” మానియా… రీ రిలీజ్ రికార్డులు బ్రేక్

pawan kalyan kushi movie creating records in re release movies

pawan kalyan kushi movie creating records in re release movies

Kushi Re Release : ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమా ఈరోజు ( 31.12.2022) కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డ్యాన్సులు, మేనరిజమ్స్ … యూత్ ని ఓ రేంజ్ లో ఫిదా చేశాయి.

కాగా ఈ సినిమా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు మూవీ మేకర్స్. కాగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం… చిన్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ… ఫ్యాన్స్ హంగామాతో ఓ మానియా క్రియేట్ చేస్తుంది. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా… జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అంటూ థియేటర్లను దద్దరిల్లిస్తున్నారు.

 

Exit mobile version