Pawan Kalyan : వారాహి యాత్రలో అంబులెన్స్ కి దారిచ్చి మానవత్వం చాటుకున్న పవన్ కళ్యాణ్..

ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు.. జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట తరలి రాగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో..

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 02:23 PM IST

Pawan Kalyan : ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, ప్రజలు.. జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట తరలి రాగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వారాహి యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది. మార్గమధ్యంలో పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు వద్ద అత్యవసర సర్వీసు అయిన అంబులెన్స్ వాహనాల మధ్య ఇరుక్కుపోవడంతో.. వారాహిని పది నిమిషాలు నిలిపివేసి ఆంబులెన్స్ కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దారిచ్చారు. అంబులెన్స్ ముందుకు వెళ్లిపోయిన తర్వాత వారాహి యాత్ర కొనసాగింది. దీంతో మానవతావాదిగా పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేసుకున్నారు.

విజయవాడ నుంచి సాగిన పవన్ వారాహి విజయ యాత్రకు అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున జయజయ ధ్వానాలు పలికారు. ముందుగా ఆటోనగర్ వద్ద పవన్ కళ్యాణ్‌కు వీర మహిళలు, జనసైనికులు హారతులతో స్వాగతం పలికారు. వారాహి యాత్ర నేపథ్యంలో బందరు రోడ్డు (65వ నెంబర్ జాతీయ రహదారి) కిక్కిరిసిపోయింది. జన ఉప్పెనకు విజయవాడ నగరం స్తంభించిపోయింది. ఆటోనగర్, కానూరు, కామయ్యతోపులలో పవన్‌కు జనసేన శ్రేణులు గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యకర్తలు వేలాది బైకులు, వందలాది కార్లతో భారీ ర్యాలీగా ఆవిర్భావ సభకు తరలివస్తున్నారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు కదులుతున్నారు.

చంద్రబాబు అంటే తనకు ఆరాధ్య భావమేమీ లేదు – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

అలాగే మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తాను అనుకున్నట్టుగా జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణ జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట వచ్చేది కాదని స్పష్టం చేశారు. తమకు టీడీపీ అంటే ఎక్స్ ట్రా ప్రేమేం లేదని అన్నారు. చంద్రబాబు అంటే తనకు ఆరాధ్య భావమేమీ లేదని పేర్కొన్నారు. ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు, సమర్థుడు కాబట్టి గౌరవిస్తున్నానని, ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటామని వివరించారు.

ఇక, పొత్తుల గురించి ప్రస్తావిస్తూ… టీడీపీ 20 సీట్లకు జనసేనను పరిమితం చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై పవన్ స్పందించారు. చేతులెత్తి మొక్కుతున్నానని, పొత్తుల గురించి తాను ఎక్కడా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాట్సాప్ మెసేజులు చూసి మీరు నమ్మేస్తే ఎలా? అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం మీకు అండగా ఉన్నాను.. కనీసం నన్ను నమ్మండి, శంకించకండి అని విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటును వృథా కానివ్వబోమని, జనసైనికులు వచ్చే ఎన్నికల్లో ఏంజరగాలని కోరుకుంటున్నారో అదే జరుగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/