Site icon Prime9

Pawan Kalyan : గద్దర్ పార్ధివ దేహం వద్ద కన్నీళ్ళు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.. బాధాకరమైన రోజు అంటూ

pawan kalyan emotional while giving condolence to gaddar

pawan kalyan emotional while giving condolence to gaddar

Pawan Kalyan : ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గద్దర్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది బాధాకరమైన రోజు అని.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు. అదే విధంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి పవన్ నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా గద్దర్ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ పవన్ కూడా ఎమోషనల్ అయ్యారు. గద్దర్ కుమారుడిని కౌగిలించుకుని పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. హార్ట్ సర్జరీకి ముందు కూడా తాను గద్దర్ తో మాట్లాడానని.. రాజకీయం పద్మవ్యూహం అని గద్దర్ తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి వస్తారని భావించానని.. కానీ ఆయన ఇక మన మధ్య లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసిందని కన్నీటి పర్యంతం అయ్యారు.

హైదరాబాద్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్.. ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయనకు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ ఊహించని రీతిలో రెండు రోజుల క్రితం మళ్ళీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈరోజు ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో చికిత్స అందించారు. అయితే మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన మృతి వార్తతో తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదం నెలకొంది.

 

 

Exit mobile version