Site icon Prime9

CI Nageswara Rao :మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు

CI Nageswara Rao

CI Nageswara Rao

#Marredpally: మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో నాగేశ్వరరావు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నాగేశ్వరరావును పోలీసు శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసు శాఖ ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

నస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో నాగేశ్వరరావు కొద్ది రోజుల పాటు జైలులో ఉన్నారు. గత నెలలో అతని హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుతో పాటు.. రెండు నెలలపాటు ప్రతిరోజు విచారణ అధికారి ఎదుట హాజరవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version