Site icon Prime9

KCR: మరోసారి సెంటిమెంట్ అస్త్రం పై కేసీఆర్ చూపు

KCR on bjp

Kcr: సీఎం కేసీఆర్‌.. తెలంగాణాలో ఇన్నాళ్లూ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే.. గంత కాలంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్‌ఎస్‌లో సహజంగానే కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు బీజేపీ ఫీవర్‌ పట్టుకుందా? అందుకే ఆయన సెంటిమెంటు గోలీలు వేస్తున్నారా? ఆ గోలీలు ఎంతవరకు పనిచేస్తాయి.?

రాజకీయాల్లో సెంటిమెంటు అవసరమే.. కానీ.. అప్పుడే ఎందుకు? అనేది ఇప్పుడు తెలంగాణలో చర్చకు వస్తున్న విషయం. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ.. ఇప్పుడే.. సీఎం కేసీఆర్ “మన తెలంగాణ.. మన పాలన.. మన నీళ్లు.. మన కరెంటు” అంటూ.. సెంటిమెంటు అస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కేసీఆర్‌కు బీజేపీ ఫీవర్ పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన సెంటెమెంటు గోలీలు వేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్‌ పాలన ప్రారంభమై.. ఏడు సంవత్సరాలు అయిపోయింది. ఈ ఏడు సంవత్సరాల్లో బంగారు తెలంగాణను సాధించి ఉంటే.. ఈ సెంటిమెంటును మరోసారి తెరపైకి తెచ్చే పనిలేకుండా.. చేసిన పనిని చెప్పుకొనే వారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతున్న తీరు కేసీఆర్‌కు సహజంగానే.. కంటిపై నిద్ర కరువయ్యేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంలో బలంగా ఉండడం.. అడుగులు వేగంగా పడుతుండడం.. ఒక నియోజకవర్గం తర్వాత.. మరో నియోజకవర్గంలో బీజేపీ పాగా వేస్తుండడం.. కేసీఆర్‌కు ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు.. వివిధ పార్టీల బలమైన నాయకులు కమలం గూటికి చేరుతుండడం.. వంటివి సహజంగానే అధికార పార్టీలో కలవరం రేపుతున్నాయట. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఏ పార్టీని బలపడకుండా.. చూడడంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. 2014 2018 ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ ను బలహీన పరిచే క్రమంలో అనేక మంది నాయకులను ఆయన పార్టీలోకి తీసుకున్నారు. అదేసమయంలో టీడీపీ బలపడకుండా.. ఆపార్టీ తరఫున గెలిచిన వారికి కూడా గాలం వేశారు. అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు కూడా కేసీఆర్‌ బీజేపీని అసలు ఖాతరు చేయలేదు. ఆ ఎన్నిక ఫలితం తర్వాత.. జరుగుతున్నపరిణాలు.. బీజేపీ వ్యూహాత్మకంగా కదుపుతున్న పావులు.. పాదయాత్రలు.. మాటల తూటాలు.. ప్రెస్ మీట్లు.. బీజేపీ అగ్రనేతల రాక పోకలు.. ప్రజలకు సందేశాలు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కాషాయ పార్టీ లక్ష్యాలు..ఇలాంటివిసీఎం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారాయనే సంకేతాలు వస్తున్నాయి. సర్వే రిపోర్టుల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తోందని.. పైకి చెబుతున్నా.. అధినేతపైనా.. ఏమంత సానుకూలత ప్రజల్లో కనిపించడం లేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతోనే మరోమారు.. కేసీఆర్ “మన.. మన.. మన” అంటూ.. తెలంగాణ సమాజాన్ని.. మరోసారి సెంటిమెంటు బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి..ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

సర్వే రిపోర్టుల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తోందని.. పైకి చెబుతున్నా.. అధినేతపైనా.. ఏమంత సానుకూలత ప్రజల్లో కనిపించడం లేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతోనే మరోమారు.. కేసీఆర్ “మన.. మన.. మన” అంటూ.. తెలంగాణ సమాజాన్ని.. మరోసారి సెంటిమెంటు బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి..ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Exit mobile version