Cm Kcr Brs: హర్‌ ఏక్‌బార్‌ కిసాన్‌ సర్కార్‌.. బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సీఎం

Cm Kcr Brs: దౌర్జన్యంగా ఎన్నికల్ల గెలవడమే భాజపా లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను బీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు.

Cm Kcr Brs: దౌర్జన్యంగా ఎన్నికల్ల గెలవడమే భాజపా లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను బీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు.

జాతీయ రాజకీయాల్లో తమ ముద్ర వేసేందుకు.. బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మెుదలుపెట్టింది. అందులో భాగంగానే.. బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితమే భాజపాకు ఆయన రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ లోకి మాజీ సీఎం

ఈ మేరు గిరిధర్‌ గమాంగ్‌కు కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. మాజీ సీఎంతో పాటు మరికొందలు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తనదైన రితీలో విమర్శించారు.

మనదేశంలో అధిక సంపద ఉన్నా.. అమెరికా చైనా వంటి దేశాల వెనకే ఉన్నామని కేసీఆర్ అన్నారు.

ఈ రెండు దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మనం ఇంకా వెనకపడుతున్నామని అన్నారు.

గడిచిన 75 ఏళ్లలో గొప్పగా ఏం సాధించలేమని.. చాలా రాష్ట్రాల్లో ఇప్పటివరకు రైతులు సాగు నీరు కూడా అందివ్వలేకపోతున్నామని అన్నారు.
దేశంలో రైతుల పరిస్థితిని మార్చేందుకు.. బీఆర్ఎస్ రావల్సిన అవసం ఉందని కేసీఆర్ అన్నారు. దేశ భవిష్యత్ కోసం.. నేతలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు.

ఒడిషాలో పుష్కలంగా నీటి సదుపాయం ఉన్నా.. చాలా చోట్ల తాగునీరు అందలేదని కేసీఆర్ Kcr  గుర్తు చేశారు.

ప్రతి రాష్ట్రంలో అవసరమైన సందప ఉందని.. దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నపుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఎన్నికల్లో జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగిన వారు.. ఇపుడు గెలిచాక ఏం చేస్తున్నారని ఆరోపించారు.

కొన్ని పార్టీలకు ఎన్నికల్లో గెలవడం తప్పా.. అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు.
రైతులు కూడా చట్టసభల్లోకి వచ్చినపుడే.. అందరికి న్యాయం జరుగుతుందని అన్నారు.

దేశంలో సత్తా చాటేందుకు.. హర్‌ ఏక్‌బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో
ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని.. వలసలు తగ్గి వ్యవసాయం పెరిగిందని కేసీఆర్ అన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/