Site icon Prime9

NTR 30 Pooja Ceremony : వైభవంగా #NTR30 పూజా కార్యక్రమం.. హాజరైన పలువురు ప్రముఖులు

ntr-30-movie-strated-with-pooja-ceremony-and-photos-goes-viral

ntr-30-movie-strated-with-pooja-ceremony-and-photos-goes-viral

NTR 30 Pooja Ceremony : ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇటీవలే జరిగిన ఆస్కార్ వేడుకల్లో కూడా ఎన్టీఆర్ గురించే ఎక్కువగా మెన్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు తారక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు తారక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చింది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా ఒకసారి పూజా కార్యక్రమం అనుకున్నా అది తారకరత్న మృతితో వాయిదా పడింది.

ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్కార్ కోసం వెళ్లి రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం మార్చ్ 23న జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉంటూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే హైఓల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమానికి సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దిల్ రాజు, సితార, మైత్రి సంస్థల నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు విచ్చేశారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలరించనుంది. ఆమె కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరైంది. తెలుగులో ఆమె చేస్తున్న ఫస్టు సినిమా ఇదే కావడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశాడు.

యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమం సందర్భంగా రాజమౌళితో ఎన్టీఆర్, జాన్వీ సరదాగా ముచ్చట్లు పెట్టారు. అలాగే సినిమా పూజా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో NTR 30 ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ ”ఎన్టీఆర్ గారితో రెండోసారి సినిమా చేస్తున్నాను. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఆయనతో పని చేయడం నిజంగా అదృష్టం. ఈ తరంలో అత్యుత్తమ నటులలో ఎన్టీఆర్ ఒకరు. నాకు సోదరుడితో సమానం” అని వివరించారు.

 

Exit mobile version