Site icon Prime9

Wimbledon 2022: వింబుల్డన్ విజేత జకోవిచ్

Wimbledon 2022: సెర్బియాకు చెందిన జకోవిచ్ 2022 వింబుల్డన్ విజేతగా నిలిచాడు. టోర్ని మొత్తం సవాళ్లను ఎదుర్కొన్న జకోవిచ్. ఫైనల్ లో నిక్ కిరియోస్ ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో కెరియర్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

టెన్నిస్‌ చరిత్రలో మూడు గ్రాండ్‌స్లామ్‌ల్లో కనీసం ఎనిమిది ఫైనల్స్‌ ఆడిన తొలి ఆటగాడు జకోవిచ్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొమ్మిది సార్లు విజేతగా నిలిచాడు. వింబుల్డన్‌లో ఎనిమిది ఫైనల్స్‌లో ఏడుసార్లు ట్రోఫీని గెలుచుకున్నాడు. యుఎస్‌ ఓపెన్‌లో తొమ్మిది ఫైనల్స్‌కు గాను మూడు సార్లు టైటిల్‌ నెగ్గాడు. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ విషయానికి వస్తే ఆరు సార్లు ఫైనల్‌ ఆడి.. రెండు సార్లు విజేతగా నిలిచాడు.

Exit mobile version