Site icon Prime9

Niharika : పుష్ప 2 లో నిహారిక.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్.. ఇంకా ఏం చెప్పిందంటే?

niharika opens on acting in allu arjun pushpa 2

niharika opens on acting in allu arjun pushpa 2

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనస్సు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం నిహారిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన సిరీస్ ‘డెడ్‌ పిక్సెల్స్‌’. ఈ వెబ్ సీరిస్‌లో నిహారిక కొణిదెలతో పాటు వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 1న రిలీజ్ చేసిన ‘డెడ్ పిక్సెల్స్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. వీడియో గేమ్‌ల్లో పడి యువత ఎంతగా ప్రభావితమవుతున్నారనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్ హాట్ స్టార్, ఓటీటీలో మే 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ‘డెడ్ పిక్సెల్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పలు రూమర్స్‌కు చెక్‌ పెట్టింది.

ఈ మేరకు నిహారికా మాట్లాడుతూ.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. సోషల్‌ మీడియాలో వచ్చే రూమర్స్‌ వల్ల మొదట్లో కొంత బాధపడినా ఆ తర్వాత పట్టించుకోవడం మానేశా. పుష్ప 2లో నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు. ఇదంతా మీడియానే సృష్టించింది. పుష్ప 2 చాలా మంచి సినిమా.. ఐతే ఆ సినిమా కోసం నన్నెవ్వరూ సంప్రదించలేదంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ ఐపీఎల్‌లో ఓ టీంని కొంటున్నాడని వస్తున్న వార్తలపై నిహారికను ప్రశ్నించగా.. అవునా.. నాకైతే చరణ్ అన్న చెప్పలేదు. ఏ టీం కొంటున్నాడంటూ? నా వరకైతే ఈ వార్త రాలేదని సమాధానమిచ్చింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.

పుష్ప ది రూల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న రెండో భాగం నుంచి ఇటీవల ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ టీజర్ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.కాగా ఈ సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తిరుపతి అడవుల్లో పాటు జపాన్, చైనా, మలేషియా దేశాల్లో కూడా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నారు

Exit mobile version