Site icon Prime9

Nidhhi Agerwal: ‘అందరికి నమస్కారం’ బ్యాచ్‌ కాదు నేను – నిధి అగర్వాల్‌ షాకింగ్‌ కామెంట్స్

Nidhhi Agerwal Shocking Comments: హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లుతో పాటు ప్రభాస్‌ రాజా సాబ్‌ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. కొంతకాలంగా ఆఫర్స్‌ లేక తెలుగులో ఆమె సందడి కరువైంది. దాంతో తమిళ్‌ ఇండస్ట్రీకి వెళ్లిన నిధి పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌ సినిమాతో మంచి కంబ్యాక్‌ ఇవ్వబోతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో నిధి తాజాగా హరి హర వీరమల్లు నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. పవన్‌ డైలాగ్‌ ‘సీజ్‌ ది షిప్‌’ అంటూ మూవీ అప్‌డేట్‌ ఇచ్చింది. మరోవైపు ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్‌ నిధి పేరుతో చిట్‌చాట్‌ సెషన్‌ నిర్వహించింది.

తెలుగు వచ్చా?

ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఒపికగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ మీకు తెలుగు వచ్చా అని ప్రశ్నించాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. “వస్తుంది అండి. ఎందుకు అనుమానం? నేను కేవలం ‘అందరికి నమస్కారం’ బ్యాచ్‌ కాదు ఓకే” అని సమధానం ఇచ్చింది. దీంతో ఆమె రిప్లై అందరికి షాకిచ్చింది. నిధి సమాధానం చూసి ఇది తెలుగు రాని హీరోయిన్లకు కౌంటర్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ సమాధానం ఇచ్చిందా? నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా తెలుగులో నటిస్తూ స్టార్‌ హీరోయిన్లుగా కొనసాగుతూ కనీస తెలుగు మాట్లాడానికి కూడా రాని వారికి ఆమె ఆన్సర్‌ గట్టి కౌంటర్‌ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

డార్లింగ్ ఈజ్ బ్యాక్!

మరోవైపు నిధి హరి హర వీరమల్లు పార్ట్‌ 2తో పాటు రాజాసాబ్‌ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ కూడా ఇచ్చింది. ఓ అభిమాని హరి హర వీరమల్లు పార్ట్‌ 1 మార్చిలో ఉంది.. మరి పార్ట్‌ 2 ఎప్పుడు? అని ప్రశ్నించాడు. పార్ట్‌ 2 మీరు అనుకున్నదానికంటే త్వరగానే ఉంటుంది అని సమాధానం ఇచ్చింది. రాజాసాబ్‌ నిజంగా అసలైన హరర్‌ సినిమా లేక అదనం హరర్‌ జోడించారా? అని ప్రశ్నించగా… ఇది అథెంటిక్‌ హరర్‌ మూవీ.. ప్రతి సీన్‌ అన్ని ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది అని తెలిపింది. మరో అభిమాని “రాజాసాబ్‌లో ప్రభాస్‌ రోల్‌ ఎలా ఉండనుంది?” అని అడగ్గా డార్లింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ క్రేజీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ అభిమానుల్లో మరింత జోష్‌ నింపాయి. ఒకే సెషన్‌లో ఇటూ పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అటూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయడంతో ప్రస్తుతం నిధి కామెంట్స్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

Exit mobile version