Site icon Prime9

Project k : ‘ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికే టైం కావాలి.. ఒక్క టైర్‌కి ఎంత ఓవర్ చేస్తున్నారు వీళ్లు..‘

new video released from prabhas project k movie as new year gift

new video released from prabhas project k movie as new year gift

Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ… మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ప్రభాస్ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ లు అన్నీ భారీ బడ్జెట్ లు… పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. ఈ మేరకు ఇప్పుడు ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ”ప్రాజెక్ట్ కే” అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపిక పదుకునే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చెప్పినప్పుడు, అందరూ షాక్ అయ్యారు.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను తగ్గేదె లే అనే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేయగా… అందులో చేతిని మాత్రమే చూపించారు. కాగా గతంలో నాగ్ అశ్విన్ ఈ సినిమాకి కావాల్సిన వెహికల్స్ దొరకవు, సొంతంగా తయారు చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి తగ్గట్టే మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సాయం అడగగా ఆయన ఓకే చెప్పడంతో సినిమా కోసం మహీంద్రా టీంతో కలిసి కొత్త తరహా వెహికల్స్ ని తయారు చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అంటూ ఓ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు.

అందులో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ… ఈ వీడియోలో నాగ్ అశ్విన్ అండ్ టీం… ఒక టైర్ ని తయారు చెయ్యడానికి ఎంత కష్టపడుతున్నారో చూపించారు. ఇప్పటివరకూ ఎక్కడా లేని ఒక టైర్ ని తయారు చెయ్యాలి అనేది నాగ్ అశ్విన్ ప్లాన్. ఆ ప్లాన్ ని వర్కౌట్ చెయ్యడానికి టీం అంతా ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూపించారు. ఒక తైర ని డిజైన్ చేయడానికి అంతమంది కలిసి ఇంత కస్టపడుతుండడం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఒక కొత్తరకం టైర్ ని తయారుచేశారు. ఇక టైరు ఇలా ఉంటే బండి ఎలా ఉంటుంది… మూవీ ఎలా ఉంటుందో అని ప్రభాస్ అభిమనులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version